- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేవలం ఒక్క సీన్ కోసమే 1.2 కోట్ల ఖర్చు.. ఐశ్వర్య లక్ష్మి ఆసక్తికర కామెంట్స్
ఆ సీన్ కోసం ఏకంగా 1.2 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆమె వెల్లడించారు.

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గట్ట కుస్తీ-2’. ఈ సినిమా 2022లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్‌కు సీక్వెల్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఫ్యామిలీ డ్రామాను చెల్లా అయ్యావు తెరకెక్కిస్తున్నారు. విష్ణు విశాల్ సొంత నిర్మాణ సంస్థ విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌తో పాటు వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సీక్వెల్‌లో కూడా కరుణాస్, మునీష్కాంత్, కాళీ వెంకట్ కీలక పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై-3న థియేటర్స్‌లో రాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. దీంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య లక్ష్మి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘గట్టా కుస్తీ’ మొదటి భాగంలో వచ్చే ఇంటర్వెల్ ఫైట్ సీన్ గురించి ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఆ సీన్ కోసం ఏకంగా 1.2 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆమె వెల్లడించారు. "గట్టా కుస్తీ పార్ట్ 1 ఇంటర్వెల్ సమయంలో నాకు ఒక పవర్‌ఫుల్ మాస్ సీన్ ఉంటుంది.
ఆ సీన్ గురించి మాట్లాడినప్పుడల్లా నాకు ఒక ముఖ్యమైన విషయం గుర్తొస్తుంది. విష్ణు విశాల్ కెరీర్‌లో ఆయన నటించి, నిర్మించిన సినిమాలన్నింటిలో కెల్లా అత్యంత ఖరీదైన సీన్ ఏదైనా ఉందంటే అది ఆ ఇంటర్వెల్ ఫైట్ సీనే. కేవలం ఆ ఒక్క సీన్ కోసమే దాదాపు 1.2 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు" అని ఐశ్వర్య లక్ష్మి చెప్పారుసాధారణంగా సినిమాల్లో హీరోల ఇంటర్వెల్ బ్లాక్ కోసం అంత భారీగా ఖర్చు పెడుతుంటారు. కానీ, ఒక హీరోయిన్ రేంజ్ ఎలివేషన్ సీన్ కోసం అంత భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం నిజంగా విశేషం. దీనిపై ఐశ్వర్య లక్ష్మి స్పందిస్తూ.. "మొదట కథ విన్నప్పుడు నేనొక చిన్న సీన్‌లాగే భావించాను. కానీ, దర్శకుడు చెల్లా అయ్యావు, విష్ణు విశాల్ గార్లు ఆ సీన్‌ను చాలా అద్భుతంగా ప్లాన్ చేసి మార్చేశారు. థియేటర్లలో ఆ సీన్ వస్తున్నప్పుడు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన క్లాప్స్, రెస్పాన్స్ వచ్చాయి. అదొక టీమ్ ఎఫర్ట్. కథ విన్నప్పుడు నాకు నచ్చింది నేను చేశాను, కానీ స్క్రీన్ పై ఆ సీన్స్ చాలా పెద్దగా వర్కవుట్ అయ్యాయి" అంటూ సంతోషం వ్యక్తం చేశారు.






