- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ద్రోణి ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలకు భారీ వర్షసూచన
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. వర్షాకాలం మొదలైనా ఎల్ నినో ప్రభావంతో ఎండలు ఠారెత్తిస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. వర్షాకాలం మొదలైనా ఎల్ నినో ప్రభావంతో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. అప్పుడప్పుడూ వచ్చే వర్షాలు ఊరటనిస్తున్నాయి. రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకూ విస్తరించిన ద్రోణి ప్రభావంతో మంగళవారం ఉత్తరాంధ్ర జిల్లాలైన కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్సుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వర్షాలు పడే సమయంలో భారీ వృక్షాలు, హోర్డింగులు వద్ద నిలబడవద్దని తెలిపింది.
ఆరెంజ్ అలర్ట్..
కాగా.. ఈరోజు సాయంత్రం విజయవాడతో పాటు పల్నాడు, గుంటూరు-మంగళగిరి, నంద్యాల, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రి వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో సాయంత్రం వరకూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. కర్ణాటక నుంచి వస్తున్న ద్రోణి కారణంగా రాత్రికి రాయలసీమ జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.






