పాల్వంచలో కంచి విశ్వవిద్యాలయం స్పాట్ కౌన్సిలింగ్

by Batti.Sumithra |

శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులచే స్థాపించబడిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాల కోసం ఈ నెల 25న పాల్వంచలో స్పాట్ కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

పాల్వంచలో కంచి విశ్వవిద్యాలయం స్పాట్ కౌన్సిలింగ్
X

దిశ, పాల్వంచ: శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులచే స్థాపించబడిన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి వివిధ యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాల కోసం ఈ నెల 25న పాల్వంచలో స్పాట్ కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గట్టాయిగూడెంలోని భక్తాంజనేయస్వామి దేవాలయంలో గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కౌన్సిలింగ్ కార్యక్రమం జరగనుంది.

ఇంజినీరింగ్, బీఏ, మేనేజ్‌మెంట్, లా, సంస్కృతం, సైన్స్ తదితర విభాగాల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరుకావచ్చని సూచించారు. ఈ సందర్భంగా కంచి విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్ జి. శ్రీనివాస్, డీన్ (సైన్స్) ప్రొఫెసర్ వెంకటరామన్ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. పూర్తి వివరాలకు 7708557707, 8074407367 (వేణుగోపాలాచార్యులు – వేణు అయ్యగారు), 9394645666 (ఎస్‌వీఆర్‌కే ఆచార్యులు)ను సంప్రదించవచ్చని తెలిపారు.

Next Story