- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీతమ్మసాగర్‌లో వేల కోట్ల ఇసుక దందా.. సీఎంపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు
సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్టు ముంపు పేరుతో సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల మంత్రులు గోదావరి నదిని చెరబట్టాలని కుట్రలు చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’లో ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సీతమ్మ సాగర్ మల్టీ పర్పస్ ప్రాజెక్టు ముంపు పేరుతో సీఎం రేవంత్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల మంత్రులు గోదావరి నదిని చెరబట్టాలని కుట్రలు చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ‘ఎక్స్’లో ఆరోపించారు. ఆదివాసీల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని ఇసుక క్వారీల పేరుతో గ్రామ సభలు నిర్వహించి.. 70 కి.మీ.ల పొడవునా గోదావరి నుంచి ఇసుక తవ్వి.. రూ.వేల కోట్ల దందాకు తెరతీశారని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతమ్మ సాగర్ హెడ్ వర్క్స్ ఉంటే అక్కడి నుంచి 70 కిలోమీటర్ల దూరంలోని ములుగు జిల్లా మంగపేట మండలం రమణక్కపేట, వాడ గూడెం, అకినపల్లి వరకు గోదావరి నది ముంపు పేరుతో మొత్తం ఇసుక దోచేసి వేల కోట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారని తెలిపారు. సీఎం డైరెక్షన్‌లో ఇద్దరు మంత్రులు సాగిస్తున్న ఈ దందాకు అడ్డుకట్ట వేసే వరకు తెలంగాణ రక్షణ సేన పోరాడుతుందని పేర్కొన్నారు.






