- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
' ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి '
by Batti.Sumithra |
రెబ్బెన మండలంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని రెబ్బెన తహసీల్దార్ సూర్యప్రకాశ్ తెలిపారు.

X
దిశ, రెబ్బెన : రెబ్బెన మండలంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని రెబ్బెన తహసీల్దార్ సూర్యప్రకాశ్ తెలిపారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 వరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు) ఇంటింటి సర్వే నిర్వహిస్తారని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయడంతో పాటు, మరణించిన వారి పేర్లను తొలగించే ప్రక్రియ చేపడతామని తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులందరూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మండలంలోని ప్రజలు, ప్రజాప్రతినిధులు, బీఎల్ఏలు, వాలంటీర్లు బీఎల్ఓలకు పూర్తి సహకారం అందించి ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తహసీల్దార్ సూర్యప్రకాశ్ కోరారు.
Next Story






