గాలివానకు కూలిపోయిన ఇల్లు

by velandi.Saikiran |

రేగొండ మండలం రేపాక సోమవారం మధ్యాహ్నం గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది.

గాలివానకు కూలిపోయిన ఇల్లు
X

దిశ, భూపాలపల్లి ప్రతినిధి: రేగొండ మండలం రేపాక సోమవారం మధ్యాహ్నం గ్రామంలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈ క్ర‌మంలో మడప రత్నాకర్ రెడ్డికి చెందిన ఇల్లు నేల మట్టమైంది. ఆ సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇంట్లోని నిత్యావసర వస్తువులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇక దీనిపై ప్రభుత్వం స్పందించి, ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Next Story