దిశ ఎఫెక్ట్ : ఈఎస్ఐ కార్డుల తప్పులు సరిచేసిన కుమారి కన్సల్టెన్సీ

by Batti.Sumithra |

ఆలేరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుల ఈఎస్ఐ కార్డుల జారీలో చోటుచేసుకున్న తప్పుల పై దిశ దినపత్రికలో శనివారం ప్రచురితమైన ఈఎస్ఐ కార్డులో జారీలో “ఏజెన్సీ ఇష్టారాజ్యం” అనే కథనం ప్రచురణ చేసింది.

దిశ ఎఫెక్ట్ : ఈఎస్ఐ కార్డుల తప్పులు సరిచేసిన కుమారి కన్సల్టెన్సీ
X

దిశ, ఆలేరు : ఆలేరు మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుల ఈఎస్ఐ కార్డుల జారీలో చోటుచేసుకున్న తప్పుల పై దిశ దినపత్రికలో శనివారం ప్రచురితమైన ఈఎస్ఐ కార్డులో జారీలో “ఏజెన్సీ ఇష్టారాజ్యం” అనే కథనం ప్రచురణ చేసింది. దీంతో కథనానికి వెంటనే స్పందన లభించింది. కథనం వెలువడిన వెంటనే కుమారి కన్సల్టెన్సీ నిర్వాహకులు స్పందించి, సోమవారం తమ ప్రతినిధులను ముగ్గురిని ఆలేరు మున్సిపాలిటీ కార్యాలయానికి పంపించారు. అక్కడ కార్మికుల ఈఎస్ఐ కార్డుల్లో ఉన్న తప్పులను పరిశీలించి సరి చేశారు. దీంతో కార్మికులు "దిశ "కు ధన్యవాదాలు తెలిపారు.

Next Story