- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఉక్కుపాదం..
నార్సింగి మండలం నర్సంపల్లి గ్రామ శివారులో బొమ్మ–బొరుసు జూదం ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, చిన్నశంకరంపేట: నార్సింగి మండలం నర్సంపల్లి గ్రామ శివారులో బొమ్మ–బొరుసు జూదం నిర్వహిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. అరెస్టు చేసిన వారిలో కుమ్మరి లింగం, శ్రీరామ్ సతీష్, పెంజర్ల రాజేందర్, దేవసోత్ దశరథ్, చాకలి వెంకటేష్ ఉన్నారు. వారి వద్ద నుంచి రూ.20,796 నగదుతో పాటు 6 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసులో నవీన్ రెడ్డి, గుగులోత్ రాజ్ నాయక్ పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో జూదం, పేకాట, బొమ్మ–బొరుసు, కోడిపందేలు వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా జూదం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.






