గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

by Ratna Kumari |

మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామ శివారులోని జాతీయ రహదారి-44పై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
X

దిశ, మెండోరా : మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామ శివారులోని జాతీయ రహదారి-44పై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుడు సుమారు 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వ్యక్తిగా, తెల్లటి గడ్డం, తెల్లటి జుట్టుతో ఉన్నట్లు మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైన ఆయన ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై సుహాసిని తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 8712659763, 8712659864 నంబర్లకు సంప్రదించాలని మెండోరా పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Next Story