సీఎం రేవంత్‌పై వ్యాఖ్యలు చేస్తే సహించం.. వివేకానంద్ కు వార్నింగ్

by velandi.Saikiran |

కేపీ వివేకానంద్ పై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

సీఎం రేవంత్‌పై వ్యాఖ్యలు చేస్తే సహించం.. వివేకానంద్ కు వార్నింగ్
X

దిశ, కుత్బుల్లాపూర్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గాంధీభవన్ లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. కుత్బుల్లాపూర్ లో భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ వివేకానందే అని కూన ఘాటుగా విమర్శించారు. స్థానిక ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ విమర్శలకు పరిమితమవుతున్నారని మండిపడ్డారు.

తాను చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను ప్రజల ముందు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నానని కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు. "మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీరు కుత్బుల్లాపూర్‌కు ఏం చేశారో చెప్పండి. ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు నేను సిద్ధం" అంటూ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కు సవాల్ విసిరారు. ఈ మీడియాలో స‌మావేశంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రెష్ యాదవ్, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి తో పాటు పలువురు పాల్గొన్నారు.

Next Story