అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఆర్ఆర్ఆర్

by velandi.Saikiran |

రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, రాజేందర్ రెడ్డి.. ఈ ముగ్గురూ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారని రావు పద్మ మండిపడ్డారు.

అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఆర్ఆర్ఆర్
X

దిశ హన్మకొండ టౌన్ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి.. ఈ ముగ్గురూ (ఆర్ఆర్ఆర్) అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారని బీజేపీ రాష్ట్ర నాయకులు రావు పద్మ మండిపడ్డారు. హనుమకొండ జిల్లా అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రావు పద్మ రెడ్డి మాట్లాడుతూ, వరంగల్ నగర అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరితే, సమాధానం చెప్పలేక కాంగ్రెస్ నాయకులు తోక ముడిచారని ఎద్దేవా చేశారు. ఆనాడైనా, ఈనాడైనా ఓరుగల్లు అభివృద్ధికి కార‌ణం కేంద్ర స‌ర్కారే అన్నారు. ఇప్పటికైనా అబద్ధాల రాజకీయం పక్కన పెట్టి, వరంగల్ అభివృద్ధికి ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా పగడాల కాళీప్రసాద్, జిల్లా నాయకులు సండ్ర మధు, కూతురు రాజు, కందగట్ల సత్యనారాయణ, తోపుచర్ల మధు, కేతిపల్లి సంపత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Next Story