దశదిన కర్మకు వెళ్తుండగా ఘోరం.. ముగ్గురు స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |

దశదిన కర్మకు వెళ్తుండగా జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. శావల్యాపురం మండలం వేల్పూరుకు చెందిన 10 మంది నాదెండ్ల మండలం సంకురాత్రిపాడులో జరిగే దశదినకర్మకు హాజరయ్యేందుకు ఆటోలో బయల్దేరారు...

దశదిన కర్మకు వెళ్తుండగా ఘోరం.. ముగ్గురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: దశదిన కర్మకు వెళ్తుండగా జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. శావల్యాపురం మండలం వేల్పూరుకు చెందిన 10 మంది నాదెండ్ల మండలం సంకురాత్రిపాడులో జరిగే దశదినకర్మకు హాజరయ్యేందుకు ఆటోలో బయల్దేరారు. అయితే సంతమాగులూరు మండలం కామేపల్లి రైల్వే అండర్ పాస్ వద్దకు రాగానే ఆటోను గ్రానైట్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు స్పాట్ డెడ్ అయ్యారు. మృతులు ఏడుకొండలు, రమణమ్మ, సుబ్బాయమ్మగా గుర్తించారు. మరో ఏడుగురు గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story