- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
by Ratna Kumari |
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపేట్ ఎక్స్ రోడ్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, సదాశివనగర్ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపేట్ ఎక్స్ రోడ్ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ వైపు వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన మహీంద్రా కారు అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కి, ఎదురుగా నిజామాబాద్ వైపు వెళ్తున్న హ్యుందాయ్ ఆరా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహీంద్రా కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు గాయపడగా, హ్యుందాయ్ ఆరా కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్ పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాదానికి గురైన రెండు వాహనాలను రోడ్డు పక్కకు తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.
Next Story






