- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కెతావత్ రామకృష్ణకు కీలక బాధ్యతలు.. తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం
జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ సంఘాల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కెతావత్ రామకృష్ణను నియమిస్తున్నట్లు ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఉదిత్ రాజ్ ప్రకటించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ సంఘాల సమాఖ్య తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కెతావత్ రామకృష్ణను నియమిస్తున్నట్లు ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షులు, మాజీ పార్లమెంట్ సభ్యులు ఉదిత్ రాజ్ ప్రకటించారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర రాజధాని శ్రీనగర్‌లో మూడు రోజుల పాటు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఉదిత్ రాజ్ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ సంఘాల సమాఖ్య జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సులో రామకృష్ణకు 21 రాష్ట్రాల అధ్యక్షులు, ప్రతినిధుల సమక్షంలో ఇందుకు సంబంధించిన నియామక పత్రం అందించారు. తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగ వ్యాప్తి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ప్రజల అభ్యున్నతికి రామకృష్ణ కృషి చేస్తారని ఆకాంక్షిస్తున్నట్లు ఉదిత్ రాజ్ తెలిపారు.
ప్రస్తుతం రామకృష్ణ హైదరాబాద్ డివిజన్ ఆర్డీఓగా, డిప్యూటీ కలెక్టర్ల సంఘం జనరల్ సెక్రటరీగా, తెలంగాణ ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారత రాజ్యాంగ వ్యాప్తి కోసం కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఉదిత్ రాజ్, రాష్ట్ర అధ్యక్షులు మహేశ్వర్ రాజ్‌లకు రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను అత్యంత నిష్ఠతో నెరవేర్చి ఆర్గనైజేషన్ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.






