చర్చకు ఎక్కడంటే అక్కడికి వస్తా: డీసీసీ అధ్యక్షుడు

by Kodari Anjali |

మీలా కమిషన్లు తీసుకొని, బ్రోకర్ బ్రోకర్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ నేతలకు రాదని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ అన్నారు.

చర్చకు ఎక్కడంటే అక్కడికి వస్తా: డీసీసీ అధ్యక్షుడు
X

దిశ, మెదక్ ప్రతినిధి: మీలా కమిషన్లు తీసుకొని, బ్రోకర్ బ్రోకర్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీ నేతలకు రాదని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ అన్నారు. మైనం పల్లి పై పద్మా దేవేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక భూపతి రాజ్, వైస్ చైర్మన్ నరేశ్ గౌడ్ తో కలసి సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. మెదక్ నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మా రాష్ట్ర నాయకుడు మైనం పల్లి హన్మంతరావు పై కేటీఆ ర్ బ్యాచ్ గ్లోబల్ ప్రచారం చేస్తుందని ఆరోపించారు. మెదక్‌లో ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదని ఆరోపించడం సరి కాదన్నట్టు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ యాసంగిలో 4.18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని, రికార్డు స్థాయిలో ధాన్యం రావడం వల్ల కొంత ఆలస్యం అయిందన్నారు. రైతుల సమస్య కోసం కాంగ్రెస్ పార్టీయే ముందుగా ధర్నా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పటి వరకు 90 శాతం మంది రైతులకు ధాన్యం డబ్బులు ఖాతాల్లో జమ చేసినట్టు చెప్పారు. ఇప్పటి వరకు మెదక్ నియోజక వర్గంలో వెయ్యి కోట్ల అభివృద్ధి జరిగిందని, కావాలంటే నిధుల వివరాలు బీఆర్ఎస్ నేతలకు పంపిస్తామని చెప్పారు.

ప్రభుత్వం కార్యాలయాలు తరలిపోతుంటే...

గతంలో వారి పాలనలో జరిగినట్టు ఇసుక అమ్మకోలేదని, మెదక్‌లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు తరలిపోలేదన్నారు. అప్పుడు మీరు మీ షాడో ఎమ్మెల్యే ఏమి చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే టిక్కెట్ పరేషాన్ వల్ల ఆమె అలా మాట్లాడుతుందని ఎద్దేవా చేశారు. వర్షాకాలంలో ప్రాణాలకు తెగించి వరదల్లో చిక్కుకున్న వారిని మా నేత దగ్గర ఉంది కాపాడదని, తమంత వెంటే ఉన్నామన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ వచ్చి రివ్యూ చేసిన విషయం బీఆర్ఎస్ నేతలు మరచిపోయినట్లు ఉన్నారని, అందుకే వరదలు వచ్చిన పట్టించుకోనట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రభుత్వం కార్యాలయాలు తరలిపోతుంటే చేతులు ముడుచుకు కూర్చున్న మీరు ఇప్పుడు అభివృద్ధి లేడని ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మెదక్ నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని, చర్చకు రావాలని పిలుపునిచ్చారు. మెదక్‌లో జరిగిన అభివృద్ధి వివరాలు బీఆర్ఎస్ నేతలకు పంపిస్తామని, అప్పుడే జరిగిన అభివృద్ధి తెలుస్తుందని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గంగాధర్, మాజీ చైర్మన్ రాగి అశోక్, హఫీజ్, నాగరాజు, రమేష్, మహిపాల్ రెడ్డి, శ్రీకాంత్, తాహెర్, విశ్వం, రాజశేఖర్, కౌన్సిలర్ లు మాజీ కౌన్సిలర్ లు పాల్గొన్నారు.

Next Story