కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు ఎమ్మెల్సీ దువ్వాడ...ఉద్రిక్తత

by Vemula.Srinu Prasad |

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణకు ఆయన కొత్తూరు పీఎస్ వద్దకు వెళ్లారు...

కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు ఎమ్మెల్సీ దువ్వాడ...ఉద్రిక్తత
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా(Srikakulam) కొత్తూరు పోలీస్ స్టేషన్(Kotturu Police Station) వద్ద ఉద్రిక్తత(Tension) చోటు చేసుకుంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy Cm Pawan Kalyan)పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(Mlc Duvvada Srinivas) అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణకు ఆయన కొత్తూరు పీఎస్ వద్దకు వెళ్లారు. అయితే అనుచరులతో ఒక్కసారిగా వెళ్లడాన్ని పోలీసులు తప్పుబట్టారు. అనుమతి లేదంటూ పోలీస్ స్టేషన్‌లోని వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో దువ్వాడ అనుచరులు వాగ్వాదానికి దిగారు. అయినప్పటికీ దువ్వాడ శ్రీనివాస్‌తో పాటు మాధురి, అడ్వొకేట్ ను మాత్రమే పోలీస్ స్టేషన్‌లోని అనుమతించారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్‌ను పోలీసులు విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్ బయట దువ్వాడ అనుచరుల భారీగా చేరుకున్నారు. పీఎస్ లోపల ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా చూస్తున్నారు. తమ నేతపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టారని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపిస్తున్నారు.

Next Story