ఏకంగా అన్ని కోట్లకు అమ్ముడుపోయిన 'రావు బహదూర్' ఓటీటీ హక్కులు

by Pulgam srinivas |

ఈ మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ.7 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఏకంగా అన్ని కోట్లకు అమ్ముడుపోయిన రావు బహదూర్ ఓటీటీ హక్కులు
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వారిలో సత్యదేవ్ ఒకరు. తాజాగా ఆయన, వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన ‘రావ్ బహదూర్’ చిత్రంలో హీరోగా నటించారు. ఈ సినిమాను జూలై 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే, ఈ చిత్రానికి సూపర్ సాలిడ్ ఓటీటీ డీల్ కుదిరినట్లు సమాచారం. మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ.7 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా, సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తే అదనంగా మరికొంత మొత్తాన్ని చెల్లించేందుకు కూడా సంస్థ అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో చిత్రం భారీ విజయం సాధిస్తే, ఓటీటీ డీల్ ద్వారానే రూ.10 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ చిత్రంలో వికాస్ ముప్పాల, దీపా థామస్, ఆనంద్ భారతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చింత గోపాలకృష్ణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా, మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా A+S మూవీస్ మరియు శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రూపొందుతోంది.

Next Story