- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెన్సార్ పూర్తి చేసుకున్న ఆర్య ‘అనంతన్ కాడు’ సినిమా.. షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన బోర్డ్ సభ్యులు!
ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు చిత్రానికి ‘A’ సర్టిఫికెట్‌ను జారీ చేశారు

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ‘అనంతన్ కాడు’. జియెన్ కృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆర్య సరసన రెజీనా కసాండ్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో అచ్చుత్ కుమార్, నిఖిలా విమల్, ఇంద్రన్స్, మురళి గోపి కీలక పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 25న విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పూర్తి చేసుకుంది. అయితే, ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డ్ సభ్యులు చిత్రానికి ‘A’ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. అంటే ఈ సినిమా కేవలం పెద్దలు మాత్రమే చూడాలి. 18 ఏళ్ల లోపు వయసు ఉన్న పిల్లలకు థియేటర్స్‌లోకి ఎంట్రీ ఉండదు.
సినిమాలో ఉన్న కొన్ని హెవీ యాక్షన్ ఎపిసోడ్స్, రొమాంటిక్ సీన్స్, ఘాటైన డైలాగ్స్,పొలిటికల్ డ్రామా తీవ్రత కారణంగానే సెన్సార్ బోర్డ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ‘A’ సర్టిఫికెట్ టాక్ రావడంతో సినిమాపై మాస్ ఆడియన్స్‌లో అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. కేరళ-తమిళనాడు సరిహద్దుల్లోని దట్టమైన అడవులు, రాజకీయాల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. 'అనంతన్ కాడు' అనేది ఒక వివాదాస్పదమైన అటవీ ప్రాంతం. అక్కడ కొన్ని వందల కోట్ల విలువైన ప్రకృతి సంపద లేదా ఒక రహస్యం దాగి ఉంటుంది. దానిని దక్కించుకోవడానికి అధికారంలో ఉన్న కొందరు అవినీతి రాజకీయ నాయకులు, ల్యాండ్ మాఫియా ముఠాలు కుట్రలు పన్నుతుంటాయి. ఆ అడవిని అక్కడ ఉండే అమాయక ప్రజలను కాపాడే వ్యక్తి పాత్రలో ఆర్య కనిపించనున్నట్లు తెలుస్తోంది.






