- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్రిబుల్ ఆర్ బాధిత రైతులు ఆర్డీవోకు వినతి..
నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయండని త్రిబుల్ ఆర్ బాధిత రైతులు ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.

దిశ, నర్సాపూర్: రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న తుజాల్పూర్, తిరుమలాపూర్ రైతులు సోమవారం నాడు నష్టపరిహారం చెల్లించాలంటూ ఆర్డీఓ రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తమ వ్యవసాయ భూమిని ఆర్ ఆర్ ఆర్ నిర్మాణానికి ప్రభుత్వం సేకరించిందని వెల్లడించారు. 70 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకుంటున్న భూములు అటవీ భూములుగా సాకులు చెబుతూ నష్టపరిహారం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భూమి పైన గతంలో ప్రభుత్వ పథకాలు, లోన్లు పొందడం జరిగిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోల్పోయిన భూమికి నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్డీవో రామకృష్ణ మాట్లాడుతూ, ఈ భూమి గురించి కలెక్టర్‌కు నివేదిక పంపించడం జరిగిందన్నారు. జాయింట్ సర్వే నిర్వహించి రైతులకు నష్టపరిహారం జరిగేలా చూస్తామన్నారు. పై అధికారుల నుండి నివేదిక రాగానే ఫారెస్ట్, రెవెన్యూ డిపార్ట్మెంట్‌లతో కలిసి జాయింట్ సర్వే చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు రక్షణ సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, బాధిత రైతులు పాల్గొన్నారు.






