'నోరు మూసుకోండి.. యూస్‌లెస్ ఫెలోస్'.. సొంత కార్యకర్తలపై విరుచుకుపడ్డ ఖర్గే

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత పార్టీ కార్యకర్తలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ తన ప్రసంగానికి అంతరాయం కలిగించిన కొందరు కాంగ్రెస్ శ్రేణులను "పనికిమాలిన వాళ్లారా" (Useless fellows) అంటూ మైకులోనే గద్దించారు.

నోరు మూసుకోండి.. యూస్‌లెస్ ఫెలోస్.. సొంత కార్యకర్తలపై విరుచుకుపడ్డ ఖర్గే
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సొంత పార్టీ కార్యకర్తలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తూ తన ప్రసంగానికి అంతరాయం కలిగించిన కొందరు కాంగ్రెస్ శ్రేణులను "పనికిమాలిన వాళ్లారా" (Useless fellows) అంటూ మైకులోనే గద్దించారు. బెంగళూరులోని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) కార్యాలయంలో కొత్తగా నియమితులైన పదాధికారుల ప్రమాణ స్వీకార ఉత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో పాటు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై ఖర్గే ప్రసంగిస్తుండగా, సభలో ఉన్న ఒక వర్గం కార్యకర్తలు ఆయన మాటలను అడ్డుకుంటూ "డీకే.. డీకే.." అంటూ గట్టిగా నినాదాలు చేయడం ప్రారంభించారు.

దీనిపై తీవ్ర అసహనానికి లోనైన ఖర్గే మైకులోనే కార్యకర్తలపై విరుచుకుపడ్డారు. "అక్కడ నిలబడి అరుస్తున్న వాళ్లంతా నోరు మూసుకోండి. మీ నాయకుడి ముందు భక్తిని చాటుకోవడానికి ఇది వేదిక కాదు. నిశ్శబ్దంగా కూర్చోండి, లేదంటే ఇక్కడి నుండి వెళ్ళిపోండి" అని హెచ్చరించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోబోమని, మీరంతా పనికిమాలిన వాళ్లంటూ కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో ఘాటుగా వ్యాఖ్యానించారు. ఖర్గే ఆగ్రహం చూసిన డీకే శివకుమార్ వెంటనే లేచి నిలబడి, నినాదాలు ఆపాల్సిందిగా తన మద్దతుదారులకు సైగలు చేశారు. ఇప్పుడిది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Next Story