- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నా.. ‘లెనిన్’ రిలీజ్‌పై అక్కినేని అఖిల్ షాకింగ్ కామెంట్స్!
ఈ సినిమా విడుదల కోసం తాను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని, ప్రస్తుతం తనపై తీవ్రమైన ఒత్తిడి ఉందని అఖిల్ ఓపెన్‌గా చెప్పారు. ఒక రకమైన టెన్షన్ అనుభవిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

దిశ, సినిమా: అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రాబోతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఇందులో అఖిల్, భాగ్యశ్రీతో పాటు సుదర్శన్, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పలు వాయిదాల తర్వాత జూలై 10న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, యాంకర్ సుమతో జరిగిన తాజా ఇంటర్వ్యూలో అఖిల్ పాల్గొని, సినిమా ఆలస్యం కావడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా విడుదల కోసం తాను ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని, ప్రస్తుతం తనపై తీవ్రమైన ఒత్తిడి ఉందని అఖిల్ ఓపెన్‌గా చెప్పారు. ఒక రకమైన టెన్షన్ అనుభవిస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
ఈ ప్రాజెక్ట్ కోసం తాను ఎంతగానో శ్రమించానని, తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి భారీగా శ్రమను పెట్టుబడిగా పెట్టానని అఖిల్ వివరించారు. తాను పడ్డ కష్టాన్ని, చూపించిన శ్రద్ధను ప్రేక్షకులు ఖచ్చితంగా గుర్తిస్తారని, థియేటర్లలో సినిమా చూసి ఆదరిస్తారనే గట్టి నమ్మకంతో ఉన్నట్లు ఆయన తెలిపారు. గతంలో వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడక డిజాస్టర్లుగా మిగిలిపోవడంతో, ఈ సినిమా సక్సెస్ అఖిల్‌కు ఎంతో కీలకంగా మారింది. అయితే అఖిల్ కెరీర్‌లో ‘లెనిన్’ ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే, ఇప్పటివరకు స్టైలిష్, లవర్ బాయ్ లుక్స్‌లో కనిపించిన అఖిల్.. ఈ సినిమాలో మొదటిసారి ఒక ఊర మాస్, పల్లెటూరి నేపథ్యం ఉన్న రస్టిక్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇది ఆయన మునుపటి సినిమాల కంటే పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని సమాచారం.






