- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > ఖమ్మం > రోడ్డుపై అడ్డంగా పడిపోయిన చెట్లు.. కిలోమీటరు వరకు నిలిచిపోయిన వాహనాలు.
రోడ్డుపై అడ్డంగా పడిపోయిన చెట్లు.. కిలోమీటరు వరకు నిలిచిపోయిన వాహనాలు.
by Kodari Anjali |
అకాల వర్షాలకు మండల పరిధిలోని భగవాన్ నాయక్ తండ సమీపంలో చెట్లు రోడ్లమీద విరిగిపడి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

X
దిశ, ఏన్కూర్: గాలిదుమారాలకు, అకాల వర్షాలకు మండల పరిధిలోని భగవాన్ నాయక్ తండ సమీపంలో చెట్లు రోడ్లమీద విరిగిపడి ట్రాఫిక్ అంతరాయం కలిగే విధంగా చేసింది. సోమవారం మధ్యాహ్నం ఏన్కూరు మండలంలో అకాల వర్షం కురిసింది. దానికి తోడుగా విపరీతమైన గాలి రావడంతో రోడ్లమీద చెట్లు విరిగిపడ్డాయి. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగపోయినప్పటికీ.. రోడ్డుకు అడ్డంగా చెట్లు పడిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న ఏన్కూర్ మండల పంచాయతీ అధికారి జివిఎస్ నారాయణ, పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో, జెసిబి సహాయంతో రోడ్లమీద విరిగిపడ్డ చెట్లను తొలగింపుకు చర్యలు చేపట్టారు. రోడ్ల పైన వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అధికారులు వాహనాలు నిలిచిపోకుండా చర్యలు చేపట్టడంతో వాహనాలు వెళ్లాయి.
Next Story






