కృష్ణకాంత్ పార్క్ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే

by Kodari Anjali |

జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్ అభివృద్ధి పనులపై హైడ్రా అధికారులతో ఎమ్మెల్యే వి.నవీన్ యాదవ్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

కృష్ణకాంత్ పార్క్ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే
X

దిశ, జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్ అభివృద్ధి పనులపై హైడ్రా అధికారులతో ఎమ్మెల్యే వి.నవీన్ యాదవ్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్కులో మౌలిక వసతుల మెరుగుదల, పచ్చదనం పెంపు, మొక్కల సంరక్షణ, వాకింగ్ ట్రాక్‌ల అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. పార్క్‌ను సందర్శించే ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే పిల్లలు, వృద్ధులు, కుటుంబ సభ్యులు ఉపయోగించుకునేలా మెరుగైన సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కృష్ణకాంత్ పార్క్‌ను నగర ప్రజలకు ఆకర్షణీయమైన వినోద, విశ్రాంతి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని హైడ్రా అధికారులకు ఆదేశించారు.

Next Story