- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొహర్రం ప్రశాంతంగా నిర్వహించుకోవాలి
మొహరం (పీర్ల) పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కోరుట్ల పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.

X
దిశ, కోరుట్ల రూరల్: రాబోయే మొహరం (పీర్ల) పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కోరుట్ల పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ చిరంజీవి సమక్షంలో పీర్ల నిర్వహణ కమిటీ సభ్యులతో సమావేశం శనివారం నిర్వహించారు. సమావేశంలో సిఐ మాట్లాడుతూ, మొహరం పండుగను ఈ నెల 27న మాత్రమే నిర్వహించాలని హిందూ, ముస్లిం సోదరులు పరస్పర సహకారంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పండుగను సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని ఆయన సూచించారు. కొన్ని గ్రామాలు, కాలనీల్లో కొంతమంది ఈ నెల 26న పీర్ల పండుగ నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం అందడంతో, ఆయా కమిటీ సభ్యులను ప్రత్యేకంగా పిలిపించి అధికారికంగా జూన్ 27న మాత్రమే కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.
Next Story






