కమ్మర్‌పల్లి సొసైటీ డైరెక్టర్లు మూకుమ్మడి రాజీనామా

by Batti.Sumithra |

మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో శనివారం సొసైటీ డైరెక్టర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సొసైటీ చైర్మన్, సెక్రటరీలు ఉప్లూర్ గ్రామ రైతులకు రెండు లారీల యూరియాను తరలించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

కమ్మర్‌పల్లి సొసైటీ డైరెక్టర్లు మూకుమ్మడి రాజీనామా
X

దిశ, కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో శనివారం సొసైటీ డైరెక్టర్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సొసైటీ చైర్మన్, సెక్రటరీలు ఉప్లూర్ గ్రామ రైతులకు రెండు లారీల యూరియాను తరలించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. సొసైటీ డైరెక్టర్లకు తెలియకుండా రెండు లారీల యూరియాను తరలించడాన్ని నిరసిస్తూ సొసైటీ డైరెక్టర్లు మూకుమ్మడిగా రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆన్‌లైన్ విధానాన్ని పాటించకుండా ఆఫ్‌లైన్‌లో ఉప్లూర్ రైతులకు యూరియా పంపిణీ చేయడం పై కమ్మర్‌పల్లి గ్రామ రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం పై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టి, బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్లు, రైతులు డిమాండ్ చేశారు.

Next Story