- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు జంతర్‌మంతర్‌ని వదిలివెళ్లేది లేదు: కాక్రోచ్ పార్టీ చీఫ్
నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత భారీ ధర్నా చేపట్టారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మరోసారి ధర్నాకు దిగింది. నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 6న ఢిల్లీలో నిర్వహించిన తొలి భారీ నిరసన చేపట్టగా ఇవాళ మరోసారి ధర్నా చేప్టటారు. ఇవాళ్టి ఆందోళనకు పెద్ద ఎత్తున యువతీ యువకులు జంతర్ మంతర్ వద్దకు చేరుకుని మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, గో ప్రధాన్ గో అంటూ ప్లేట్లపై చెంచాలతో కొడుతూ నినాదాలు చేశారు.
అప్పటి వరకు జంతర్ మంతర్ ను వదిలి వెళ్లబోను:
ఈ సందర్భంగా మాట్లాడిన సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తాను జంతర్ మంతర్‍ను వదిలిపెళ్లబోయేది లేదన్నారు. జంతర్ మంతర్ వద్ద సీజేపీ అనుమతి నిరసనకు పొడిగించాలని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే షరతుతో ప్రభుత్వంతో చర్చల కోసం మార్గాలు తెరవాలని దీప్కే పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
సా.6 గంటలకు అందరూ రావాలి:
మరోవైపు ఇవాళ సాయంత్రం 6 గంటలకు జరిగే నిరసనలో పాల్గొనాలని ప్రజలకు సీజేపీ ఆహ్వానించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ ఈరోజు సాయంత్రం 6 గంటలకు జంతర్ మంతర్ వద్ద జరిగే నిరసన ప్రదర్శనలో పాల్గొనాలని సీజేపీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఆసక్తిగల పౌరులకు విజ్ఞప్తి చేసింది. అయితే సుప్రీంకోర్టు అనుమతి మేరకు ఇక్కడ సాయంత్రం 5 గంటల వరకే అనుమతి ఉందని పోలీసులు అక్కడి నుంచి అందరని వెనక్కి పంపించి వేస్తున్నారు.






