- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ పర్వతారోహకురాలు అన్విత సరికొత్త రికార్డు
ఏడు ఖండాల లక్ష్యంలో ఆరు శిఖరాలు అధిరోహించిన తెలంగాణ బిడ్డ తన లక్ష్యానికి మరో అడుగు దూరంలో నిలిచారు.

దిశ, డైనమిక్ బ్యూరో: భారతీయ పర్వతారోహకురాలు పడమటి అన్విత మరో ప్రతిష్టాత్మక మైలురాయి పూర్తి చేసింది. 19 జూన్‍న ఉత్తరఅమెరికాలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం మౌంట్ డెనాలీ (6,190 మీటర్లు) ను విజయవంతంగా అధిరోహించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏడుఖండాలలోని ఎత్తైన శిఖరాలను అధిరోహించే ప్రతిష్టాత్మక ‘సెవెన్సమిట్స్ఛాలెంజ్’ (Seven Summits Challenge) లో భాగంగా ఆమె సాధించిన 6వ శిఖరం ఇది. ఈ విజయంతో, ప్రపంచంలోని ఏడు ఖండాల అత్యున్నత శిఖరాలను అధిరోహించిన కొద్ది మంది భారతీయ మహిళల జాబితాలో చేరడానికి ఆమె మరో అడుగు దూరంలో నిలిచారు.
అన్విత సాధించిన అపూర్వ విజయాలు:
అత్యంత అనుభవజ్ఞురాలైన హై-ఆల్టిట్యూడ్ పర్వతారోహకురాలిగా అన్విత ఇది వరకే పలు అంతర్జాతీయ శిఖరాలను అధిరోహించారు.
- మౌంట్ఎవరెస్ట్ (8,849 మీటర్లు)
- మౌంట్మనస్లు (8,163 మీటర్లు) – మౌంట్మనస్లు ‘ట్రూసమిట్’ (నిజమైనశిఖరాగ్రం) ను చేరుకున్న మొదటి భారతీయురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు.
- మౌంట్విన్సన్ (అంటార్కిటికా)
- మౌంట్ఎల్బ్రస్ (యూరప్) – శీతాకాలంలో (Winter Season) ఈ శిఖరాన్నిఅధిరోహించి, అక్కడ 10 మీటర్ల భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసిన మొదటి భారతీయురాలిగా రికార్డుకెక్కారు.
- మౌంట్కిలిమంజారో (ఆఫ్రికా)
- మౌంట్అకాన్‌కాగ్వా (దక్షిణఅమెరికా)
- వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్ లోని మౌంట్గోరిచెన్, లడఖ్ లోని మౌంట్ ఖడే వంటి ప్రముఖ భారతీయ శిఖరాల యాత్రలకు ఆమె నాయకత్వం వహించారు.
తెలంగాణ స్ఫూర్తి.. కుటుంబ నేపథ్యం:
అన్విత తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి-భువనగిరి జిల్లా, భువనగిరి పట్టణానికి చెందిన మధుసూదన్ రెడ్డి, చంద్రకల దంపతుల కుమార్తె. తనకుటుంబం అందించిన నిరంతర ప్రోత్సాహం, మద్దతుతోనే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని అన్విత పేర్కొన్నారు. తన సాధించిన విజయాలకు గాను గతంలో తెలంగాణ ప్రభుత్వం నుండి ‘వుమెన్ పురస్కార్ అవార్డు’, అలాగే అప్పటి గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందరరాజన్ చేతుల మీదుగా ‘బెస్ట్ అచీవర్ అవార్డు’ను కూడా ఆమె అందుకున్నారు. ప్రస్తుతం భువనగిరిలోని 'ట్రాన్సెండ్ అకాడమీ ఆఫ్ రాక్ క్లైంబింగ్' లో యువ క్లైంబర్లకు శిక్షణ మరియు మెంటార్‌షిప్ అందిస్తున్న అన్విత సెవెన్ సమిట్స్ యాత్రలన్నింటికీ 'అన్విత గ్రూప్' దీర్ఘకాలికంగా పూర్తి ఆర్థిక మద్దతును అందిస్తోంది.
వినయం, ఓర్పు:
విజయం అనంతరం అన్విత మాట్లాడుతూ.. ప్రతి పర్వతం మనకు వినయం, ఓర్పు, పట్టుదలను నేర్పుతుందని మౌంట్ డెనాలి శిఖరంపై భారత జాతీయ జెండాను ఎగురవేయడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విజయాన్ని నా కుటుంబానికి, నన్ను నమ్మిన మద్దతుదారులకు, నా మెంటార్లకు అంకితం ఇస్తున్నానని భావోద్వేగానికి గురయ్యారు. ఈ అరుదైన మైలురాయిని అధిగమించిన అన్వితపై తెలంగాణ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.






