- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాకింగ్ చేస్తే డెత్ రిస్క్ తగ్గుతుందా..? అధ్యయనాలు చెప్పేది ఇదే..
రోజుకు 8000 అడుగులు నడిస్తే డెత్ రిస్క్ 51% తగ్గుతుందని ఒక అధ్యయనం పేర్కొన్నది.

దిశ, ఫీచర్స్ : మీరు ఎక్కువ రోజులు ఆరోగ్యంగా జీవించాలనుకుంటున్నారా? అయితే రోజుకు 8 వేల అడుగులు(నడక) వేయండి అంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ఎందుకంటే.. ఇది మీ శరీరానికి గొప్ప వ్యాయామంగా పనిచేస్తుందని, డైలీ ఇలా చేసేవారిలో మరణాల రేటు 51% తగ్గుతుందని జామా ఇంటర్నేషన్ మెడిసిన్‌లో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొన్నది. రోజుకు 4,000 అడుగులు మాత్రమే వాకింగ్ చేసేవారితో పోలిస్తే.. 8,000 అడుగులు నడిచే వ్యక్తులు ఈ విధమైన ఫలితాలను పొందుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
అధ్యయనంలో భాగంగా.. 72,000 మందికిపైగా వాలంటీర్ల స్టెప్ కౌంట్‌ను, వారి ఆరోగ్యం, జీవన ప్రమాణాలను రీసెర్చర్స్ విశ్లేషించారు. అయితే ఎక్కువ అడుగులు నడిచేవారు, ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను పొందుతున్నారని ఈ సందర్భంగా కనుగొన్నారు. ఇక్కడ స్టెప్స్ సంఖ్యతో పాటు, వేగంగా (పేస్) నడవడం కూడా స్వతంత్రంగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని గుర్తించారు. జపాన్ పెడోమీటర్ కంపెనీ నిర్వహించిన మరొక అధ్యయనంలో కూడా రోజుకు సమారు 4 మైళ్లు, అంటే 8వేల అడుగులు నడవడంవల్ల మరణ ప్రమాదం భారీగా తగ్గుతుందని తేలింది. ప్రస్తుతం చాలామంది సగటున 3,000 నుంచి 4,000 స్టెప్స్ మాత్రమే నడుస్తున్నారు. దీనిని 8 వేలకు పెంచగలిగితే.. అద్భుతమైన ఆరోగ్య ఫలితాలను పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. దీనివల్ల వృద్ధాప్య దశలో కూడా ఔషధాలు లేదా పరికరాలు వాడకం చాలా వరకు తగ్గించవచ్చునని అంటున్నారు. జీవనశైలిలో చిన్నపాటి మార్పులతో కూడా దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని మెరుగు పర్చుకోవచ్చునని ఈ అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి.






