- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్స్.. ఓ రెస్టారెంట్‍కు సూపర్ మార్క్స్ మరో రెస్టారెంట్‍కు నోటీసులు
సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఓ రెస్టారెంట్ కు మంచి మార్కులు రాగా మరో రెస్టారెంట్ కు నోటీసులు ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శనివారం సీఎంసీ (CMC) ఫుడ్ సేఫ్టీ బృందాలు కొండాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లోని ప్రముఖ రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో ఓ రెస్టారెంట్ 92 శాతం మార్కులతో బెస్ట్ అనిపించుకోగా మరో రెస్టారెంట్‌లో నిబంధనల ఉల్లంఘనలు బయటపడటంతో అధికారులు నోటీసులు జారీ చేశారు.
సత్తిబాబు బిర్యానీకి మార్కులు:
కొండాపూర్‌లోని సత్తిబాబు బిర్యానీ రెస్టారెంట్ ఆహార భద్రతా ప్రమాణాలను పాటించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు ఫుడ్ సేప్టీ అధికారులు వెల్లడించారు. హైజీన్ అసెస్‌మెంట్‌లో ఈ రెస్టారెంట్‍కు 92 శాతం మార్కులు లభించాయని పేర్కొన్నారు. ఫుడ్ హ్యాండ్లర్లు అందరూ హెయిర్‌నెట్స్, గ్లోవ్స్, మరియు ఏప్రాన్లు ధరించడంతో పాటు మెడికల్ ఫిట్‌నెస్, పెస్ట్ కంట్రోల్, వాటర్ టెస్టింగ్ రికార్డులు పక్కాగా ఉన్నాయని వెజ్, నాన్-వెజ్ పదార్థాలను విడివిడిగా భద్రపరిచినట్లు గుర్తించారు. మాంసాన్ని శుభ్రం చేసి, సరిగ్గా ప్యాక్ చేసి స్టోర్ చేయడంతో పాటు ఇక్కడ 'ఫోస్టాక్' (FoSTaC) సర్టిఫైడ్ ఫుడ్ సేఫ్టీ సూపర్వైజర్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే తనిఖీల సమయంలో కొన్ని ఆహార పదార్థాలపై మూతలు పెట్టకపోడాన్ని గమనించిన అధికారులు మూతలు మూసి ఉంచాలని, వాడుతున్న నెయ్యి ప్యాకెట్లపై సరైన లేబులింగ్ లేకపోవడంతో లేబుల్స్ కలిగిన ఉత్పత్తులనే వాడాలని అధికారులు సూచించారు.
7 సిస్టర్స్ రెస్టారెంట్‍కు నోటీసులు:
హైటెక్ సిటీ ఎన్‌ఏసీ బిల్డింగ్ దగ్గర ఉన్న 7 సిస్టర్స్ రెస్టారెంట్ లో తనిఖీలు నిర్వహించిన అధికారులుఈ రెస్టారెంట్‌కు హైజీన్ అసెస్‌మెంట్‌లో కేవలం 73 శాతం మార్కులు మాత్రమే ఇచ్చారు. వండిన ఆహార పదార్థాలను నిర్దేశిత గడువు లోపు పారేయకుండా అలాగే దాచి ఉంచారని, డ్రైనేజీ ప్రాంతాల సమీపంలో ఆహార పదార్థాలను సరైన మూతలు లేకుండా తెరిచి ఉంచినట్లు పేర్కొన్నారు. స్టోర్ రూమ్‌లో బల్లి విసర్జితాలు (Lizard droppings) లభ్యమయ్యాయని అక్కడ క్లీనింగ్ సరిగ్గా లేదని తేలింది. కిచెన్ ఫ్లోరింగ్ దెబ్బతిని, టైల్స్ పగిలిపోయి ప్రమాదకరంగా ఉన్నాయని మాంసం పదార్థాలకు సరైన లేబులింగ్ లేదు, అలాగే హాట్ వాటర్ శానిటైజేషన్ పద్ధతులను పాటించడం లేదని గుర్తించారు. ఈ లోపాలపై తీవ్రంగా స్పందించిన ఫుడ్ సేఫ్టీ బృందం సదరు రెస్టారెంట్‌కు ఇంప్రూవ్‌మెంట్ నోటీసు (Improvement Notice) జారీ చేసింది. ఆహార నిల్వ, లేబులింగ్, పరిశుభ్రత మరియు హౌస్ కీపింగ్ పద్ధతులను తక్షణమే మెరుగుపరుచుకోవాలని యాజమాన్యాన్ని ఆదేశించింది.






