- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Phonepe: ఇన్‌యాక్టివ్ వాలెట్ ఛార్జీలపై ఫోన్‌పే క్లారిటీ
ఈ ఇన్‌యాక్టివ్ ఫీజులు కేవలం ప్రీపెయిడ్ వాలెట్ బ్యాలెన్స్‌కు మాత్రమే వర్తిస్తాయని, వినియోగదారుల బ్యాంక్ ఖాతాలతో గానీ లేదా యూపీఐ లావాదేవీలతో గానీ వీటికి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది.

దిశ, బిజినెస్ బ్యూరో: డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ ‘ఫోన్‌పే’ ఇటీవల వాలెట్ మెయింటెనెన్స్ ఖర్చుల కోసం పంపిన ‘ఇనాక్టివిటీ ఫీజు’ నోటిఫికేషన్లు యూజర్లలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. ఫోన్‌పే యాప్, యూపీఐ అకౌంట్, ఫోన్‌పే వాలెట్.. ఈ మూడూ ఒకటేననే సాధారణ అపోహ వల్ల, వాలెట్ వాడకపోతే తమ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయేమోనని కస్టమర్లు భయాందోళనలకు గురయ్యారు. అయితే, ఈ ఆందోళనలపై కంపెనీ కీలక స్పష్టతనిచ్చింది. ఈ ఇన్‌యాక్టివ్ ఫీజులు కేవలం ప్రీపెయిడ్ వాలెట్ బ్యాలెన్స్‌కు మాత్రమే వర్తిస్తాయని, వినియోగదారుల బ్యాంక్ ఖాతాలతో గానీ లేదా యూపీఐ లావాదేవీలతో గానీ వీటికి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. వాలెట్‌లో డబ్బులు ఉండి, దాన్ని ఏడాది పైగా వాడకుండా వదిలేస్తేనే 3 నెలలకు రూ.100(ప్లస్ జీఎస్టీ) చొప్పున కట్ అవుతుంది. ఒకవేళ వాలెట్‌లో అసలు డబ్బే లేకపోతే ఎలాంటి ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదని, అలాగే వాలెట్ బ్యాలెన్స్ ‘నెగటివ్’ లోకి వెళ్లే ఛాన్స్ కూడా లేదని సంస్థ స్పష్టం చేసింది.
వాలెట్ యాక్టివేషన్ రూల్స్
ప్రతిరోజూ క్యూఆర్ కోడ్ స్కాన్‌లు, బిల్లు చెల్లింపుల కోసం ఫోన్‌పే యాప్‌ను వాడుతున్నప్పటికీ, తమకు ఇన్‌యాక్టివ్ అలర్ట్స్ వస్తున్నాయని కొందరు యూజర్లు ఫిర్యాదులు చేశారు. దీనికి కారణం.. యాప్‌లో యూపీఐ లావాదేవీలు, వాలెట్ నిర్వహణ విడివిడిగా ట్రాక్ అవుతుండటమే. దీనర్థం, యూపీఐ ద్వారా రోజూ డబ్బులు పంపుతున్నా, వాలెట్‌ను నెలల తరబడి ముట్టుకోకపోతే అది ‘ఇన్‌యాక్టివ్’ గానే మారుతుంది. అయితే, వాలెట్ బ్యాలెన్స్ నుంచి ఏదైనా ఫీజు కట్ చేయడానికి 15 రోజుల ముందే కస్టమర్లకు అలర్ట్ పంపుతామని ఫోన్‌పే వెల్లడించింది. ఈ లోపు యూజర్లు ఓటీపీ వెరిఫికేషన్ లేదా ఏదైనా చిన్న ట్రాన్సాక్షన్‌తో వాలెట్‌ను రీ-యాక్టివేట్ చేసుకోవచ్చని పేర్కొంది.






