‘స్పిరిట్’ నుంచి ప్రభాస్ లుక్ వైరల్.. ఈసారి తగలబడిపోవాల్సిందే అంటూ ట్వీట్స్

by Chukka Sudharani |

అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి ప్రభాస్ లుక్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.

‘స్పిరిట్’ నుంచి ప్రభాస్ లుక్ వైరల్.. ఈసారి తగలబడిపోవాల్సిందే అంటూ ట్వీట్స్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ప్రాజెక్టులలో ‘స్పిరిట్’ ఒకటి. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌ను టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై భూషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా.. క్రిష్ ఫేమ్ వివేక్ ఒబెరాయ్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. తాజాగా ఈ చిత్రం నుంచి ప్రభాస్‌కు సంబంధించిన ఓ షాడో లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో ఓ తెరపై షాడోలా సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కనిపిస్తుండగా.. ప్రభాస్ గుబురు జుట్టుతో తలపై క్యాప్ పెట్టుకుని కనిపించాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుండగా.. ఈ లుక్‌లో ప్రభాస్ అన్నను రీసెంట్‌గా చూశా.. త్వరలో రివీల్ చేయబోతున్నారు.. ఈసారి తగలబడిపోవాల్సిందే అంటూ ఫిలిమ్ వర్గాల నుంచి ట్వీట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

Next Story