కోతికి కన్నీటి వీడ్కోలు

by Batti.Sumithra |

మండల కేంద్రంలోని కనగల్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో విద్యుత్ ఘాతానికి గురై ఓ కోతి మృతి చెందింది.

కోతికి కన్నీటి వీడ్కోలు
X

దిశ, కనగల్ : మండల కేంద్రంలోని కనగల్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో విద్యుత్ ఘాతానికి గురై ఓ కోతి మృతి చెందింది. ఈ ఘటన స్థానికులను కలచివేసింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు మూగజీవి మృతి పై సంతాపం వ్యక్తం చేశారు. హిందూ సంప్రదాయాల్లో కోతిని ఆంజనేయస్వామి రూపంగా భావించే నేపథ్యంలో గ్రామప్రజలు కోతికి ప్రత్యేకంగా నివాళులర్పించారు. గ్రామస్తులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి, డప్పుచప్పులతో గ్రామపంచాయతీ ట్రాక్టర్‌లో కోతి మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ మనుషులతో పాటు మూగజీవాల పట్ల కూడా ప్రేమ, దయ, కరుణ చూపించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. కోతి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు.

Next Story