- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య నిర్వహణ.. పట్టించుకోని అధికారులు
శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది.

దిశ, శంకర్ పల్లి: శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్తకుప్పలు దారిలో వెళ్తుంటే కంపు వాసన కొడుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద చెత్త కుప్పలు దర్శనమిస్తుండడం మునిసిపల్ అధికారుల పారిశుద్ధ్య నిర్వహణకు పరాకాష్టగా చెప్పవచ్చు. ప్రధాన రహదారి వెంబడే చెత్తకుప్పలు ఇలా దర్శనమిస్తుంటే ఇక కాలనీలలో పరిస్థితి మరింత దారుణంగా తయారయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని సంగారెడ్డి రోడ్డు వెంబడి అక్కడక్కడ చెత్తకుప్పలు దర్శనం ఇవ్వడం మున్సిపల్ పారిశుద్ధ సిబ్బంది 10 గంటలు దాటినా వాటిని తొలగించకపోవడంతో రోడ్ల వెంబడి వెళ్లే వాహనదారులు ముక్కులు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి దాపురిస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో పారిశుధ్య నిర్వహణకు సరిపోను సిబ్బంది లేకపోవడం ఉన్న పారిశుద్ధ్య వాహనాలు సిబ్బంది ప్రధాన రహదారులలో చెత్త తొలగింపుకే పరిమితం కావడంతో ఇళ్లలో నుంచి కూడా చెత్త తెచ్చి రోడ్లపై పారబోస్తున్నారు. పోలీస్ క్వార్టర్స్, సంగారెడ్డి రోడ్డు, సింగపూర్ రోడ్డు నుంచి టవర్ వరకు చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు సంగారెడ్డి రోడ్డు వెంబడి టవర్ వరకు పేరుకుపోయిన చెత్తను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






