అక్కడే చూసుకోండి.. ఇక్కడకు రావొద్దు: పవన్‌కు కవిత మరోసారి వార్నింగ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-20 14:20:16  IST  )

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏపీలోనే రాజకీయాలు చేసుకోవాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ మణికొండలో జనసేన కార్యాలయాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించడం, ఇటీవల జరిగిన పరిణామాలపై ఆమె స్పందించారు..

అక్కడే చూసుకోండి.. ఇక్కడకు రావొద్దు: పవన్‌కు కవిత మరోసారి వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) ఏపీ(Ap)లోనే రాజకీయాలు చేసుకోవాలని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత(Trs Chief Kalvakuntla Kavitha) అన్నారు. హైదరాబాద్ మణికొండ(Hyderbad Manikonda)లో జనసేన కార్యాలయాన్ని(Jansena Office) పవన్ కల్యాణ్ ప్రారంభించడం, ఇటీవల జరిగిన పరిణామాలపై ఆమె స్పందించారు. పవన్ కల్యాణ్ సినిమాలు చూసి సంతోషిస్తామని చెప్పిన ఆమె సినిమాల ముసుగులో వచ్చి తెలంగాణను కబ్జా చేస్తారని వ్యాఖ్యానించారు. గతంలోనూ ఇదే జరిగిందన్నారు. సినిమాల ముసుగులో వచ్చి ఆంధ్ర భాష బాగుంది.. తెలంగాణ యాస బాగోలేదని మొదలు పెడతారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పుట్టకముందే తమను ఏడ్చించారని, తెలంగాణ యాసలో మాట్లాడలేని పరిస్థితులు ఉండేవన్నారు. తెలంగాణ యాసలోనే, భాషలోనే మాట్లాడతామని కొట్లాడినామని కవిత చెప్పారు.

పవన్‌‌పై కల్వకుంట్ల కవిత ఆగ్రహం

‘‘మా ఊరు భువనగిరి.. నా పేరు యాదగిరి.. నేను చేసేది దాదాగిరి’’ అనే సినిమా డైలాగు చెప్పి తెలంగాణలోని అన్ని ప్రాంతాలవారిని అవమానించారని కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమం తర్వాత తెలంగాణ డైలాగ్స్‌ను హీరోలకు పెట్టడం ప్రారంభించారని చెప్పారు. తెలంగాణ భాషలో మాట్లాడటం ఫ్యాషన్ అయిందని, పవన్ కల్యాణ్ సినిమాలు చూడాలని, అతని డ్యాన్స్ చూసి సంబురపడాలని, కానీ రాజకీయాల్లో రానివద్దని యువతకు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ రండి.. పోండి.. మేకప్, పేకప్‌లు చెప్పుకోండి కానీ రాష్ట్ర సెక్రటేరియట్ వైపు చూస్తే ఊరుకునేది లేదని జనసేన పార్టీ నేతలు, ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.

Next Story