ఆ గ్రామంలో ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు : బత్తుల లక్ష్మారెడ్డి

by Batti.Sumithra |

ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న “ప్రగతి సింగిడి.. జనంతో మాట.. పల్లె బాట” కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అడవిదేవులపల్లి మండలం ముదిమాణిక్యం గ్రామంలో పర్యటించారు.

ఆ గ్రామంలో ప్రజాసమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు : బత్తుల లక్ష్మారెడ్డి
X

దిశ, మిర్యాలగూడ రూరల్ : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే లక్ష్యంతో నిర్వహిస్తున్న “ప్రగతి సింగిడి.. జనంతో మాట.. పల్లె బాట” కార్యక్రమంలో భాగంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్‌ఆర్‌) అడవిదేవులపల్లి మండలంలోని ముదిమాణిక్యం గ్రామంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఎమ్మెల్యే గ్రామ సమస్యలు, అవసరాలు, అభివృద్ధి పనుల పై సమగ్రంగా చర్చించారు. గ్రామస్తులు ఎదుర్కొంటున్న తాగునీరు, రహదారులు, మౌలిక వసతులు తదితర సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామప్రజలతో మరింత సాన్నిహిత్యం పెంపొందించే ఉద్దేశంతో ఎమ్మెల్యే గ్రామంలోనే రాత్రి బసచేసి ప్రజలతో మమేకమయ్యారు.

అనంతరం శనివారం ఉదయం గ్రామంలో నిర్మాణం పూర్తయిన 16 ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులతో కలిసి ప్రారంభించి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి పేద కుటుంబానికి చేరేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి గ్రామ పర్యటనలో భాగంగా ప్రజల నుంచి సేకరించిన సమస్యలను సమీక్షించిన ఎమ్మెల్యే, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండే పారదర్శక ప్రజాపాలన అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, గ్రామాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉపసర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Next Story