- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేజీబీవీ జూనియర్ కళాశాలలో స్పెషల్ ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
మఠంపల్లి మండల కేంద్రంలోని భక్త మంత్రుల గూడెంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న స్పెషల్ ఆఫీసర్ (ఎస్‌ఓ) పోస్టును భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ తెలిపారు.

దిశ, మఠంపల్లి : మఠంపల్లి మండల కేంద్రంలోని భక్త మంత్రుల గూడెంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న స్పెషల్ ఆఫీసర్ (ఎస్‌ఓ) పోస్టును భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్పెషల్ ఆఫీసర్ తెలిపారు. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంఏ (ఇంగ్లీష్), బీఎడ్ అర్హతలతో పాటు ఎంపీహెచ్ డబ్ల్యూ (MPHW) కోర్సు పూర్తి చేసి ఉండాలని పేర్కొన్నారు. అలాగే బీఎస్‌సీ, ఎంఎస్‌సీ, బీఎడ్ పూర్తి చేసి టెట్ (TET) అర్హత పొందిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలతో పాటు అవసరమైన పత్రాలను జత చేసి ఈ నెల 23వ తేదీలోపు మఠంపల్లి కేజీబీవీ జూనియర్ కళాశాల కార్యాలయంలో సమర్పించాలని స్పెషల్ ఆఫీసర్ సూచించారు. సదరు పోస్టుకు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.






