- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామచంద్రపురంలో వైభవంగా నాభిశిల బొడ్రాయి ప్రతిష్ఠాపన
కనగల్ మండలంలోని రామచంద్రపురం గ్రామంలో శనివారం నాభిశిల బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు.

దిశ, కనగల్ : కనగల్ మండలంలోని రామచంద్రపురం గ్రామంలో శనివారం నాభిశిల బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి గ్రామానికి చేరుకోగానే గ్రామ సర్పంచ్ అందుగుల సువర్ణ వెంకటేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని వేద పండితుల ఆశీర్వాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామదేవతల ఆశీస్సులతో గ్రామాలు సుఖశాంతులతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేద ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అవసరమైన ప్రతి సందర్భంలో ప్రజలకు అండగా నిలుస్తూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. రామచంద్రపురం గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, గ్రామంలో మౌలిక వసతుల కల్పనతో పాటు రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామప్రజలు ఐకమత్యంతో ఉంటూ గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. అంతకు ముందు కనగల్ మండల కేంద్రంలో నిర్మిస్తున్న పైలాన్ పనులను పరిశీలించారు పనులను వేగవంతం చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. కురంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, కూసుకుంట్ల రాజురెడ్డి, వంపు జానయ్య, ఓర్సు పెంటయ్య, తదితరులు ఉన్నారు.






