- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వంద పడకల ఆసుపత్రిలో అరాచకం
జోగులాంబ గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి ఒక మహిళ మృతి చెందిన ఘటన మరువకముందే అలాంటి ఘటనే ఉండవెల్లి మండలం ఆలంపూర్ చౌరస్తా లోని వంద పడకల ఆసుపత్రిలో శనివారం చోటు చేసుకుంది.

దిశ, ఉండవెల్లి: జోగులాంబ గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి ఒక మహిళ మృతి చెందిన ఘటన మరువకముందే అలాంటి ఘటనే ఉండవెల్లి మండలం ఆలంపూర్ చౌరస్తా లోని వంద పడకల ఆసుపత్రిలో శనివారం చోటు చేసుకుంది. భార్యా, భర్తలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉండవెల్లి మండలం అలపూర్ చౌరస్తాకు చెందిన షేక్షావలి అనే ఆటో డ్రైవర్, తన భార్య మౌలాబీతో కలిసి నివసిస్తున్నారు. అయితే, శనివారం షేక్షావలి భార్య మౌలాబీకి గుండెలో నొప్పి వస్తుందని చెప్పడంతో ఉండవెల్లి మండలం ఆలంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే ఈసీజీ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచించారు.
అదే ఆస్పత్రిలోని ఈసీజీ సెంటర్ కు వెళ్లిన భార్యా భర్తలు... డాక్టర్ రిపోర్ట్ చూపించారు. ఈసీజీ తీయాలని అక్కడి అధికారిని కోరారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న టెక్నీషియన్ (పురుషుడు) ఈసీజీ పరీక్షలు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో మహిళా పేషెంట్ కు ఈసీజీ పరీక్షలు పురుషుడు ఎలా చేస్తారని భర్త షేక్షావలి ప్రశ్నించాడు. మీకు ఇష్టముంటే తీయించుకోండి లేదంటే, ఇక్కడ నుండి వెళ్లిపోవాలని అక్కడి టెక్నిషియన్ రెచ్చిపోయాడు.
చేసేదేమీ లేక భార్యాభర్తలు....అలంపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఈసీజీ పరీక్షలు చేయించుకున్నారు. ఇక విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని ఆసుపత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సౌకర్యాలు అందించాలని భార్యాభర్తలు డిమాండ్ చేశారు. అటు అల్లంపూర్ చౌరస్తాలోని వంద పడకల ఆసుపత్రి లో పనిచేసే డాక్టర్లు నిత్యం సమయపాలన లేకుండానే విధులకు హాజరవుతూన్నారనే ఆరోపణలు ఉన్నాయి.






