- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు, ఫాదర్స్ డేను పురస్కరించుకొని పట్టణంలోని శాంతినగర్ సెయింట్ ఆంటోనీ హైస్కూల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

దిశ, సంగారెడ్డి : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు, ఫాదర్స్ డేను పురస్కరించుకొని పట్టణంలోని శాంతినగర్ సెయింట్ ఆంటోనీ హైస్కూల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ యోగాసనాలను ప్రదర్శించారు. యోగా వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని విద్యార్థులకు వివరించారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ ఈ. విజయ్ రెడ్డి మాట్లాడుతూ యోగా ప్రతి ఒక్కరి దినచర్యలో భాగం కావాలని, ఆరోగ్యకరమైన జీవితానికి అది ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. తదనంతరం ఫాదర్స్ డే సందర్భంగా తండ్రి కుటుంబం కోసం చేసే త్యాగాలు, ప్రేమ, బాధ్యతలను గుర్తు చేస్తూ, “తల్లి నవమాసాలు మోస్తే, తండ్రి జీవితాంతం తన కుటుంబాన్ని తన హృదయంలో మోస్తాడు” అని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల తండ్రుల కోసం వివిధ ఆటల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డైరెక్టర్, ప్రిన్సిపాల్ ఈ.అరుణా రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ప్రదీప్ లక్ష్మిశెట్టి, విద్యార్థులు పాల్గొన్నారు.






