పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి: పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్

by Kodari Anjali |

మంచినీటి పైపు లైన్ పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ దాము మహేందర్ యాదవ్ అన్నారు.

పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి: పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్
X

దిశ, చైతన్యపురి: మంచినీటి పైపు లైన్ పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ దాము మహేందర్ యాదవ్ అన్నారు. శనివారం చైతన్యపురి డివిజన్ న్యూ మారుతినగర్ కాలనీలో మంచినీటి పైప్ లైన్‌లో డ్రైనేజీ నీరు కలుషితమవుతుండడంతో జలమండలి అధికారులు మరమ్మతులు చేపట్టారు. మరమ్మత్తు పనులను పరిశీలించి మాట్లాడారు. నాణ్యతతో పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. పనులలో ఏమైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకువస్తే ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మధు యాష్కిగౌడ్ ద్వారా పనులు త్వరగా పూర్తయ్యేటట్లు చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగార్జున రెడ్డి, కాలనీ వాసులు నిరంకి జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story