రైతులు పండించిన సన్నాలు కొనుగోలు చేయని సన్యాసులు: మాజీ ఎమ్మెల్యే

by Kodari Anjali |

రైతులు పండించిన సన్నాలు కొనుగోలు చేయని ఈ సన్యాసులకు తగ్గిన బుద్ది చెప్పాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఫైర్ అయ్యారు.

రైతులు పండించిన సన్నాలు కొనుగోలు చేయని సన్యాసులు: మాజీ ఎమ్మెల్యే
X

దిశ, ఖమ్మం: రైతులు పండించిన సన్నాలు కొనుగోలు చేయని ఈ సన్యాసులకు తగ్గిన బుద్ది చెప్పాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఫైర్ అయ్యారు. శనివారం ఖమ్మం నగరంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో రైతుల పంటల కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు.. రాష్ట్రవ్యాప్తంగా చూశారన్నారు. రైతు అని చెప్పుకునే వ్యవసాయ శాఖమంత్రికి రైతు బాధలు తెలవదా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యంలో సమైక్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు అవగాహన లేకపోవడంతోనే రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట... ముఖ్యమంత్రి ఒక మాట... వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం చెప్తే కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. తెలంగాణ బిడ్డల యొక్క ఆకాంక్షలు కలలు నెరవేరాలని కేసీఆర్ పోరాటం చేసినప్పుడు ఏ పరిస్థితులయితే ఉన్నాయో మల్ల అదే పరిస్థితుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అలాంటి పరిస్థితిని తీసుకొచ్చిందని అన్నారు.

90% ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగింది..

తెలంగాణ రాకముందు రైతుల బాధలు చూసి కేసీఆర్ అనేక ఆలోచనలు చేసి తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు , నియామకాలు ఈ మూడు అంశాల మీద తీసుకొని తెలంగాణ పోరాటం నిర్వహించడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను కూడికలు తీసి ప్రతి ఒక్క నీటి ఒట్టు ఒడిసి ప్రాజెక్టులు మళ్లించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. కేసీఆర్ హయాంలో 90% ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగిందని ఆయన తెలిపారు. జూలూరుపాడులో సీతారామ ప్రాజెక్టు కాలాలు తవ్వి కమిషన్ల కోసం మంత్రి పనిచేస్తున్నారని విమర్శించారు. భక్త రామ, సీతారామ ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో చెరువులని నింపేమని గుర్తు చేశారు. వరంగల్ డిక్లరేషన్‌లో 30 రకాల పంటలకు బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు ఎందుకు నాలుక మడత వేసిందని సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు రైతుబంధు ద్వారా ఆదుకున్నామని నేడు ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు రైతుబంధు ఎగ్గొట్టారని విమర్శించారు. రాబోయే రోజుల్లో రైతు పక్షాల ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

బుగ్గపాడు భూముల బదలాయింపు పై మంత్రులు సమాధానం చెప్పాలి: మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

సత్తుపల్లి నియోజకవర్గంలో బుగ్గపాడు భూములను క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎలా బదిలాయింపు చేశారని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రశ్నించారు. బుగ్గపాడు భూముల విషయంలో మంత్రి, మంత్రి తనయుడికి హస్తము ఉందా లేదా అనేది బహిరంగంగా చెప్పాలని సవాల్ విసిరారు. ఈ నెల 24వ తేదీన సత్తుపల్లి నియోజకవర్గంలో కేటీఆర్ వస్తున్నట్లు ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషయ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండాల కృష్ణ, బీఆర్ఎస్ మాజీ పట్టణ అధ్యక్షుడు పగడాల నాగరాజు, నాయకులు బొమ్మల రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Next Story