అభివృద్ధి పనులను ప్రారంభించిన చేసిన ఎమ్మెల్యే మాధవరం

by velandi.Saikiran |

పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు.

అభివృద్ధి పనులను ప్రారంభించిన చేసిన ఎమ్మెల్యే మాధవరం
X

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లి నియోజకవర్గం పరిధిలోని బాలాజీనగర్​, కేపీహెచ్​బీకాలనీ డివిజన్​లలో శనివారం పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. బాలాజీనగర్​ డివిజన్​ పరిధిలోని బాలాజీనగర్​ కాలనీ ఎల్​ఐజి, ఈడబ్ల్యుఎస్​ ఇండ్ల సముదాయంలో 46.50 లక్షల వ్యయంతో చేపడుతున్న తాగునీటి పైప్​లైన్​ పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జలమండలి అధికారులతో కలిసి ప్రారంభించారు. అదే విధంగా కేపీహెచ్​బీకాలనీలోని 7వ ఫేజ్​లో 19 లక్షలతో చేపడుతున్న డ్రైనేజి పైప్​లైన్​ పనులను ప్రారంభించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని కాలనీలలో తాగునీటి, డ్రైనేజి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగడాల బాబు రావు, మాజీ కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ రావు, కృష్ణా రెడ్డి, లక్ష్మి, రాజు, గోపి, సాయి, పవన్, శ్రీనివాస్ రెడ్డి, ధన లక్ష్మి, స్వప్న, నాగేశ్వరరావు, మోజెస్, రాజేష్, సాయి, ప్రతాప్, హరిబాబు, వెంకట్ రెడ్డి, వెంకటేశ్వరావు, విశ్వనాథ్, మణి తదితరులు పాల్గొన్నారు.

Next Story