- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా సంఘాలు గ్రామీణ అభివృద్ధికి వెన్నెముక
మహిళా సంఘాలు గ్రామీణ అభివృద్ధికి వెన్నెముక అన్నారు జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయి.

దిశ, దామెర : మహిళా సంఘాలు గ్రామీణ అభివృద్ధికి వెన్నెముక అన్నారు జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయి. శనివారం హనుమకొండ జిల్లా దామెర మండలం కోగిల్వాయి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) - సెర్ప్ కన్వర్జెన్స్ ఆధ్వర్యంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న విలేజ్ ఆర్గనైజేషన్ (వీఓ) భవనం నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహాత్ బాజ్‌పాయి మాట్లాడుతూ, మహిళా సంఘాలు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి వెన్నెముకగా నిలుస్తున్నాయని, వాటి కార్యకలాపాల నిర్వహణకు శాశ్వత భవనాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు ఈ భవనం దోహదపడుతుందని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు కీలకమని పేర్కొంటూ సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శ్రీను, ఎంపీడీవో కల్పన , తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి, ఏపీఓ అశోక్, గ్రామ సర్పంచ్ చుక్క వనిత, మహిళా సంఘాల ప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






