అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని..కొడుకునే చంపిన త‌ల్లి

by velandi.Saikiran |

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారని..కొడుకునే చంపిన త‌ల్లి
X

దిశ, కీసర: కీసర పోలీస్ స్టేషన్ పరిధి చిర్యాల్ హిడెన్ గార్డెన్ లో రెండేళ్ల బాలుడిని ప్రియుడి మోజులో ప‌డి క‌న్న త‌ల్లే చంపింది. ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. కొన్ని నెలలుగా చిర్యాల్ హిడెన్ గార్డెన్ లో జ్యోతి - స్వామి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఒక్క పాప, ఒక్క బాబు ఉన్నారు. భర్త స్వామి వృతి రీత్యా క్యాబ్ డ్రైవర్. ఉదయం వెళ్ళి రాత్రికి వచ్చాడు. స్వామి స్వ‌గ్రామం తీగుళ్ళ. అక్కడే పెళ్లి అయిన కొత్తలో నవీన్ అనే కుర్రాడితో జ్యోతి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇక మే 29వ తేదీన త‌న ఇంటికి న‌వీన్ ను జ్యోతి పిలిపించుకుంది. అదే సమయంలో జ్యోతి రెండేళ్ల‌ కుమారుడు తరుచూ ఏడ్చాడు. దీంతో విసిగిపోయిన జ్యోతి-నవీన్... బాలుడిని కొట్టి చంపారు.

అనంతరం బెడ్ మీద నుంచి కింద పడ్డాడ‌ని నాట‌కాలు ఆడుతూ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. కానీ అప్ప‌టికే ఆ కుర్రాడు చ‌నిపోయాడు. జ్యోతి మాట‌లు నమ్మిన భర్త స్వామి...బాలుడుకి అంతక్రియలు చేశాడు. ఆ త‌ర్వాత భార్య తీరుపై అనుమానం వచ్చిన భర్త స్వామి, కాలనీలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించాడు. దీంతో భార్య జ్యోతి నిజస్వ‌రూపం బ‌య‌ట‌ప‌డింది. ఈ క్ర‌మంలో భార్యపై కీసర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో విచారణ చేసిన పోలీసులు...అస‌లు నిజాన్ని రాబ‌ట్టారు. ప్ర‌స్తుతం జ్యోతి స్టేష‌న్ లో ఉండ‌గా, ప్రియుడు నవీన్ ప‌రారీలో ఉన్నాడు. ఇక నిన్న తిగుళ్ళ గ్రామంలో గాంధీ హాస్పిటల్ డాక్టర్స్, రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి రీ-పోస్టు మార్టం నిర్వహించారు. ఈ సంఘ‌ట‌న‌పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Next Story