48 గంటలైంది.. ఏం చేశారు చంద్రబాబూ?: మాజీ మంత్రి పేర్ని నాని

by Vemula.Srinu Prasad |

సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి భరోసా ఇచ్చి 48 గంటలైందని, ఏం చేశారు చంద్రబాబూ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. సాయికృష్ణ మిస్సింగ్ నేపథ్యంలో అతని కుటుంబసభ్యులకు న్యాయం చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీపై పేర్ని నాని స్పందించారు...

48 గంటలైంది.. ఏం చేశారు చంద్రబాబూ?: మాజీ మంత్రి పేర్ని నాని
X

దిశ, వెబ్ డెస్క్: సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి(Saikrishna mother, Vijayalakshmi)కి భరోసా ఇచ్చి 48 గంటలైందని, ఏం చేశారు చంద్రబాబూ(Chandrababu) అంటూ మాజీ మంత్రి పేర్ని నాని(Former Minister Perni Nani) ప్రశ్నించారు. సాయికృష్ణ మిస్సింగ్(Saikrishna Missing) నేపథ్యంలో అతని కుటుంబసభ్యులకు న్యాయం చేస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీపై పేర్ని నాని స్పందించారు. సాయికృష్ణ అదృశ్యంపై చాలా అనుమానాలున్నాయని, అసలు అతడు బతికున్నాడో?.. చనిపోయాడో?.. ఇప్పటికీ చెప్పలేదన్నారు. మార్కాపురం నుంచి విజయవాడ కృష్ణలంక తీసుకెళ్లిన తర్వాత సాయికృష్ణను ఏం చేశారని పేర్నినాని ప్రశ్నించారు. విజయవాడ సీపీ ఆదేశాలతోనే ఇదంతా జరిగిందనే సందేహాలున్నాయన్నారు. సాయికృష్ణ మిస్సింగ్ అయి 40 రోజులైందని.. పోలీసుల దాష్టీకాలపై చర్యలేవని పేర్నినాని నిలదీశారు. కృష్ణలంక CI నాగరాజు వేధింపులతో మరో వ్యక్తి క్రాంత్ కుమార్ సూసైడ్ చేసుకున్నాడని, FIRలో మాత్రం సెల్ఫీ వీడియో గురించి ప్రస్తావించలేదని చెప్పారు. మనుషులను చంపేసి సెటిల్మెంట్లు చేయడమేంటన్నారు. సీఐ నాగరాజును మాత్రమే కాదని, మిగిలినవారిని కూడా బయటకు తీయాలన్నారు. విచారణ అధికారులు కేవలం అదే శ్మశాన వాటికకే ఎలా వెళ్లారని ప్రశ్నించారు. అక్కడ ఏమైనా అధారాలు దొరికాయా? అని పేర్ని నాని నిలదీశారు.

Next Story