గూస్‌బంప్స్ గ్యారెంటీ.. హారర్ థ్రిల్లర్ ‘హ్రీం’ నుంచి టీజర్ రిలీజ్

by Chukka Sudharani |   (  Updated:2026-06-20 11:28:20  IST  )

హారర్, మిస్టికల్ థ్రిల్లర్ స్టోరీతో దర్శకుడు రాజేష్ రావూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘హ్రీం’ నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.

గూస్‌బంప్స్ గ్యారెంటీ.. హారర్ థ్రిల్లర్ ‘హ్రీం’ నుంచి టీజర్ రిలీజ్
X

దిశ, సినిమా: హారర్, మిస్టికల్ థ్రిల్లర్ స్టోరీతో దర్శకుడు రాజేష్ రావూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘హ్రీం’. తనికెళ్ల భరణీ, రాజీవ్ కనకాల, బెనర్జీ, భద్రమ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీతో పవన్ తాతా, చమింద వర్మ హీరో హీరోయిన్లుగా పరిచయం కాబోతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి అఫీషియల్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘అలాంటి క్షుద్ర శక్తుల గురించి తెలుసుకోకపోవడమే మంచిది’ అంటూ స్టార్ట్ అయిన ఈ టీజర్‌లో క్షుద్ర పూజలు, పిండాలు, ఆత్మలు వంటివి చూపిస్తూ భయంకరంగా టీజర్‌ను కట్ చేశారు మేకర్స్. ప్రజెంట్ ఈటీజర్ వైరల్ అవుతుండగా.. బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ లోడింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మూవీ టీమ్ మాట్లాడుతూ.. వరంగల్ దగ్గర పెద పెండ్యాల అనే ఊరిలో గ్రామస్తుల సహకారంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశాము. ఇందులో దాదాపు 20 నిమిషాల పాటు హై-లెవెల్ గ్రాఫిక్స్ ఉండబోతున్నాయి. కచ్చితంగా ఈ మూవీ థియేటర్స్‌లో ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story