- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బెజ్జూర్‌లో పిచ్చికుక్కల స్వైర విహారం.. 8 మందికి గాయాలు
బెజ్జూరు మండలంలోని వివిధ గ్రామాల్లో పిచ్చి కుక్కలు తీవ్ర స్వైర విహారం చేస్తున్నాయి.

దిశ, బెజ్జూర్: బెజ్జూరు మండలంలోని వివిధ గ్రామాల్లో పిచ్చి కుక్కలు తీవ్ర స్వైర విహారం చేస్తున్నాయి. కనపడ్డ వారిపై దాడి చేసి గాయాలపాలు చేస్తున్నాయి. పలు గ్రామాల్లో రెండు రోజులుగా కుక్కలు దాడి చేయడంతో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. శనివారం మండలంలోని కృష్ణ పల్లి గ్రామానికి చెందిన పద్మ, సురేష్, శాంతాబాయి, బెజ్జూరుకు చెందిన శ్రీనివాసులపై కుక్కలు దాడి చేశాయి. శుక్రవారం ఎలుక పల్లి గ్రామానికి చెందిన శాలిని, కృష్ణ పల్లి గ్రామానికి చెందిన జలపతి సిద్ధార్థ ,నాగులవాయి గ్రామానికి చెందిన రంగయ్యలపై పిచ్చికుక్కలు దాడి చేసి కలవడంతో గాయాలయ్యాయి .దీంతో గాయపడ్డ వారిని బెజ్జూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య సేవలను అందిస్తున్నారు. గ్రామాల్లో పిచ్చి కుక్కల స్వైర విహారం పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీ అధికారులు స్పందించి కుక్కల స్వైర విహారాన్ని నియంత్రించాలని కోరుతున్నారు.






