- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెరుగైన వైద్య సేవలకు ప్రభుత్వం పెద్దపీట : మంత్రి వివేక్ వెంకటస్వామి
రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడంలో ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు.

దిశ, రామచంద్రాపురం : రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడంలో ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు మరియు భూగర్భ శాస్త్ర శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో కలిసి వార్డులు, చికిత్స విభాగాలు, మౌలిక వసతులు, పారిశుద్ధ్య నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. అనంతరం రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, చికిత్స విధానం, ఆసుపత్రిలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు.
పేషంట్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, ఆసుపత్రి సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.






