- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పార్టీ సభ్యత్వ నమోదులో ముందంజలో నిలవాలి : మాజీ మంత్రి
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదులో రాష్ట్రవ్యాప్తంగా మునుగోడు నియోజకవర్గం ముందంజలో నిలవాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు.

దిశ, మునుగోడు : బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదులో రాష్ట్రవ్యాప్తంగా మునుగోడు నియోజకవర్గం ముందంజలో నిలవాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ధనలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం) అవగాహన సదస్సు, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయనతో పాటు ఎస్‌ఐఆర్ అవగాహన సదస్సు ఇన్‌చార్జి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తాయని తెలిపారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే పార్టీ సభ్యత్వ నమోదులో రాష్ట్రవ్యాప్తంగా ముందంజలో నిలిచేలా మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ కార్యక్రమం అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. ప్రతి బూత్ స్థాయిలో పార్టీ నాయకులు, బూత్ ఇన్‌చార్జీలు, బీఎల్‌ఏలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో పేర్ల చేర్పు, తొలగింపు, మార్పులు వంటి అంశాల పై పూర్తి అవగాహన కలిగి ఉండడంతో పాటు ప్రజలకు సరైన సమాచారం అందించాలని కోరారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, డిజిటల్ విధానంలో జరుగుతున్న సభ్యత్వ నమోదును గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు విజయవంతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలకమని, ప్రతి కార్యకర్త తనకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని కోరారు. ప్రజల సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతిగ్రామం, ప్రతి బూత్‌లో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఎస్‌ఐఆర్ అవగాహన సదస్సు ఇన్‌చార్జి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలు అనుసరించాల్సిన విధానాలు, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, అవసరమైన పత్రాలు, దరఖాస్తు ఫారమ్‌ల వినియోగం, ఓటర్ల ధృవీకరణ వంటి అంశాల పై సవివరంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం విజయవంతానికి ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో బూత్‌వారీగా తీసుకోవాల్సిన చర్యలు, ఓటరు జాబితా సవరణలో పాటించాల్సిన జాగ్రత్తలు, డిజిటల్ సభ్యత్వ నమోదు విధానం, కార్యకర్తల బాధ్యతలు, గ్రామస్థాయిలో నిర్వహించాల్సిన అవగాహన కార్యక్రమాల పై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పలువురు నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు క్యామ మల్లేష్, పాల్వాయి స్రవంతి, మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, బూత్ ఇన్‌చార్జీలు, బీఎల్‌ఏలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






