సీపీఎం ఆఫీసును సందర్శించిన త్రిపుర మాజీ సీఎం

by Vemula.Srinu Prasad |

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ మాణిక్ సర్కార్ శనివారం ఉదయం హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌ను సందర్శించారు...

సీపీఎం ఆఫీసును సందర్శించిన త్రిపుర మాజీ సీఎం
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్రిపుర మాజీ ముఖ్యమంత్రి, సీపీఎం సీనియర్ నాయకులు కామ్రేడ్ మాణిక్ సర్కార్ శనివారం ఉదయం హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, బండారు రవికుమార్, పార్టీ సీనియర్ నాయకులు డీజీ నరసింహారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.అరుణజ్యోతి, బి సాంబశివ, రాష్ట్ర కేంద్రం నాయకులు, కార్యకర్తలు, రాష్ట్ర ఆఫీస్ సిబ్బంధి వారికి ఘన స్వాగతం పలికారు.

అనంతరం ఆయన ఈ సందర్భంగా ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, ముఖ్య నాయకులతో సమావేమై దేశ, రాష్ట్ర రాజకీయాల గురించి, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, నిత్యావసర ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్య తదితర అంశాలపై కూలంకషంగా వివరించారు. దేశంలో లౌకిక, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో సీపీఎం, వామపక్షాల పాత్ర మరింత బలోపేతం కోసం కృషి చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, సామాజిక అంశాలు మరియు ప్రజా సమస్యలను మాణిక్ సర్కార్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగానే కేడర్‌తో వారి కుటుంబాలు, పిల్లల చదువు, ఆరోగ్యాలు తదితరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాణిక్ సర్కార్ మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలకు బయలుదేరి వెళ్ళారు.

Next Story